Nara Lokesh: టీడీపీ హయాంలో కరెంటు పోతే విచ్రితం.. మీ జమానాలో కరెంటు ఉంటే అదృష్టం: లోకేశ్ వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో విద్యుత్ కోతలు విధిస్తుండడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యంగ్యోక్తులు విసిరారు. టీడీపీ హయాంలో కరెంటు పోతే విచిత్రంగా భావించేవాళ్లని, ఇప్పుడు మీ జమానాలో కరెంటు ఉంటే అదృష్టం అనుకునే పరిస్థితి వచ్చిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. 4 నెలల్లోనే పవర్ కట్ లతో కొవ్వొత్తులు, విసనకర్రల కాలానికి తీసుకెళ్లి అందరికీ కోత పాలన అంటే ఏంటో చూపిస్తున్నారని విమర్శించారు.

"రివర్స్ ముఖ్యమంత్రి గారూ, ఏపీని అంధకారప్రదేశ్ గా మార్చిన ఘనులు మీరు, పల్లెల నుంచి పట్టణాల వరకు విద్యుత్ కోతలు పెంచుకుంటూ పోతున్నారు. జనాలు కావాలి ఇసుక, రావాలి కరెంట్ అని ఎలుగెత్తి పాడుకుంటున్నారు. కానీ అధికార మత్తు, అనుచరగణం భజనల మధ్య మీకు వినిపించడం లేదనుకుంటా" అని జగన్ పై ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Andhra Pradesh

More Telugu News