Kasthuri Shivarao: అలనాటి స్టార్ కమెడియన్ కస్తూరి శివరావు చివరికి ఆ స్థితికి వచ్చేశాడు!

  • కస్తూరి శివరావుకి అవకాశాలు తగ్గాయి 
  • నాటకాల కోసం ఊరూరా తిరిగేవాడు 
  • ఆ స్థితిలో ఆయనను చూడలేకపోయానన్న ఈశ్వర్
సీనియర్ సినిమా జర్నలిస్ట్ గా బీకే ఈశ్వర్ కి మంచి పేరు వుంది. చెన్నైలోని 'విజయచిత్ర' సినిమా పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ, చిత్రపరిశ్రమను .. అక్కడి పరిస్థితులను ఆయన దగ్గరగా చూశారు. అక్కడికి వెళ్లడానికి ముందే సినిమాల పట్ల గల అనేక విషయాలను గురించి తెలుసుకున్నారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. "కస్తూరి శివరావుకి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తరువాత, ఊరూరా తిరుగుతూ ఆయన నాటకాలు వేసేవాడు. అలా వచ్చిన డబ్బుతోనే ఆయన జీవనం గడిచేది. నేను విజయవాడలో చదువుకుంటూ ఉండగా, కస్తూరి శివరావు తన స్నేహితుడి ఇంటికి భోజనానికి వస్తున్నాడని తెలిసింది. ఆ స్నేహితుడి ఇల్లు .. మా ఇంటికి దగ్గరలోనే.

కస్తూరి శివరావును చూడాలనే ఉత్సాహంతో నేను కూడా ఎదురుచూస్తూ నుంచున్నాను. అంతలో ఒక రిక్షా వచ్చి ఆ స్నేహితుడి ఇంటిముందు ఆగింది. అందులో నుంచి కస్తూరి శివరావును నెమ్మదిగా దింపి లోపలికి నడిపించుకుని వెళ్లారు. ఆ సమయంలో ఆయన మనలో లేడు. నాకు కస్తూరి శివరావును చూశాననే ఆనందం కంటే, ఆయనని ఆ స్థితిలో చూడటం బాధ కలిగించింది" అని చెప్పుకొచ్చారు.
Kasthuri Shivarao

More Telugu News