TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం... ఘనంగా ధ్వజారోహణం

  • శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • శాస్త్రోక్తంగా ధ్వజపటం ఎగురవేత
  • స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం
తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం తిరుమల కొండపై ధ్వజారోహణం చేయడంతో బ్రహ్మోత్సవాలు షురూ అయ్యాయి. శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ ధ్వజపటం ఎగురవేశారు. తద్వారా ముక్కోటి దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. కాగా, ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే రేణిగుంట నుంచి తిరుమల పయనం అయ్యారు. ఇవాళ రాత్రి నిర్వహించే స్వామివారి పెద్ద శేష వాహన సేవలో జగన్ కూడా పాల్గొంటారు.
TTD
Tirumala
Jagan

More Telugu News