Kodela: కోడెల చనిపోయిన తర్వాత కూడా పగతీర్చుకుంటున్నారంటే ఏమనాలి?: చంద్రబాబు ఆగ్రహం

  • గుంటూరు జిల్లాలో కోడెల విగ్రహ ఏర్పాటు దిమ్మె ధ్వంసం
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • ఇలాంటి చర్యలను ఏమనుకోవాలంటూ మండిపాటు
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెను ధ్వంసం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలగారిని తప్పుడు కేసులతో, తప్పుడు ఆరోపణలతో వేధించారని, ఆయన చనిపోయిన తర్వాత కూడా పగతీర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఏమనుకోవాలి? మూడు దశాబ్దాల పాటు ప్రజాసేవలో కొనసాగిన కోడెల విగ్రహాన్ని పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసుకోవడం తప్పా? అంటూ ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటు దిమ్మెను కూల్చడం ఏంటి? అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
Kodela
Chandrababu
Telugudesam
YSRCP
Guntur District

More Telugu News