Chidambaram: చిదంబరంకు మళ్లీ నిరాశే... బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

షార్ట్స్‌లో చూడండి
ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆయనకు వ్యతిరేక నిర్ణయం వెలువడింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చిదంబరం గత బుధవారం పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, సాధారణ బెయిల్ పిటిషన్ తో పాటే, తనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Chidambaram
New Delhi
High Court
INX Media

More Telugu News