kcr: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 1న

షార్ట్స్‌లో చూడండి
అక్టోబరు 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న రెండో సమావేశం ఇది. ప్రగతిభవన్ వేదికగా రేపు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కీలక సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం గురించి కూలంకషంగా చర్చించనున్నారు. ఇక, నూతన సచివాలయ నిర్మాణంతో పాటు హుజూర్ నగర్ ఉపఎన్నిక అంశం కూడా మంత్రివర్గ సమావేశం అజెండాలో చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
Go Back to Shorts
kcr

More Telugu News