Anasuya: రైనీర్ పర్వతాల్లో అనసూయ సోయగాలు... వైరల్ అవుతున్న ఫొటోలు

  • అమెరికా టూర్ వెళ్లిన అనసూయ
  • రైనీర్ పర్వత శ్రేణి సందర్శన
  • చిన్నపిల్లలా మారిపోయానంటూ కామెంట్
తెలుగు బుల్లితెర రంగంలో అందాల యాంకర్ గా పేరుతెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ సినీ రంగంలోనూ తనదైన ముద్రవేసింది. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా అనసూయ నటన ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. తాజాగా అనసూయ హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. అమెరికాలోని ప్రఖ్యాత రైనీర్ పర్వతసానువుల్లో హాయిగా విహరిస్తోంది. వాషింగ్టన్ స్టేట్ లో ఉన్న రైనీర్ పర్వతాలు దట్టమైన అడవులకు, వన్యప్రాణులకు ఆవాసంగా పేరుగాంచాయి. ఇక్కడ ఉన్న మౌంట్ రైనీర్ నేషనల్ పార్క్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ ప్రకృతి అందాల నడుమ  ఓ చిన్న పిల్లలా మారిపోయానంటూ అనసూయ చెబుతోంది. ఆమె పర్యటన తాలూకు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Anasuya
Rainier
USA

More Telugu News