Srinivas Gowd: ఆంధ్ర వ్యాపారులు మోసగాళ్లంటూ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు

  • ఆంధ్రకు చెందిన కొందరు విద్యను వ్యాపారం చేశారు
  • విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారు
  • తెలంగాణ ప్రజలకు మోసం చేయడం తెలియదు
ఆంధ్ర వ్యాపారులు మోసగాళ్లంటూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు మంచి చదువు నేర్పిస్తామని చెప్పి, మనల్ని మోసం చేస్తున్నారని అన్నారు. వారి ఊబిలో ఎవరూ పడొద్దని సూచించారు. తెలంగాణ ప్రజలు విశ్వాసం కలిగి ఉంటారని, మోసం చేయడం వారికి తెలియదని చెప్పారు. నమ్మితే ప్రాణాలు కూడా ఇస్తారని అన్నారు. ఆంధ్రకు చెందిన కొందరు విద్యను వ్యాపారం చేశారని... విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని విమర్శించారు. రిషి నీట్, మెడికల్ అకాడమీకి చెందిన విద్యార్థులు మెడిసిన్ లో 30 సీట్లు సాధించిన సందర్భంగా మహబూబ్ నగర్ లో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
Srinivas Gowd
Andhra Pradesh
Telangana
TRS

More Telugu News