Jagan: ఉద్యోగాల చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని సగర్వంగా చెబుతున్నా: జగన్

షార్ట్స్‌లో చూడండి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ నియామకపత్రాలను అందించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఏ-కన్వెన్షన్ లో జగన్ మాట్లాడుతూ, ఉద్యోగాల చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని సగర్వంగా చెబుతున్నానని అన్నారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలపైగా ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. దాదాపు లక్షన్నర శాశ్వత ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు.

గ్రామ వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ఉద్యోగులు నిజాయతీగా, లంచాలు తీసుకోకుండా పని చేయాలని అన్నారు. దీన్ని ఉద్యోగంలా కాకుండా, బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. 72 గంటల్లో ఫిర్యాదులను పరిష్కరించడమే సచివాలయ ఉద్యోగుల బాధ్యత అని తెలిపారు. తాను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని చెప్పారు. వివక్ష లేకుండా పని చేయాలని, ప్రతి పేద ముఖంలో చిరు నవ్వు కనిపించాలని అన్నారు. ఈ ఉద్యోగాలు ఇస్తున్నది అధికారాన్ని చెలాయించడానికి కాదని చెప్పారు.
Go Back to Shorts
Jagan
Village Secretariat
Jogs
YSRCP

More Telugu News