Pakistan: పాక్ ప్రధాని ఇమ్రాన్ నోట 'జిహాద్' మాట!

  • అమెరికా నుంచి పాక్ తిరిగొచ్చిన ఇమ్రాన్ ఖాన్
  • కశ్మీరీలకు తాము అండగా ఉంటామని వెల్లడి
  • కశ్మీరీలు చేస్తున్నది జిహాద్ అంటూ వ్యాఖ్యలు
అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టులో తనకు స్వాగతం పలకడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కశ్మీరీలకు తాము అండగా నిలుస్తామని, కశ్మీరీలు జిహాద్ చేస్తున్నారని, వారికి పాకిస్థాన్ వెన్నంటి ఉంటుందని అన్నారు.

"కశ్మీరీలు చేస్తున్నది జిహాద్. మా చర్యలతో అల్లా సంతోషించాలంటే మేం కూడా అందుకు మద్దతివ్వాల్సిందే. ఇదో పోరాటం.  కొన్నిసార్లు మనకు ఎదురుదెబ్బలు తగలొచ్చు. అంతమాత్రాన ఆత్మస్థయిర్యం కోల్పోకూడదు. మనవైపే చూస్తున్న కశ్మీరీలను దృష్టిలో పెట్టుకుని మనం నిరుత్సాహానికి గురికాకూడదు. పాకిస్థానీ ప్రజల సహకారం ఉంటే కశ్మీరీలు తప్పకుండా విజయం సాధిస్తారు" అంటూ వ్యాఖ్యానించారు.
Pakistan
India
Jammu And Kashmir
Imran Khan

More Telugu News