Chandrababu: గ్రామ వలంటీర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం... ట్వీట్ తో బదులిచ్చిన ఎమ్మెల్యే విడదల రజని

  • గ్రామ వలంటీర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటూ కథనాలు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు
  • ట్విట్టర్ లో స్పందించిన చిలకలూరిపేట ఎమ్మెల్యే
గ్రామ వలంటీర్లను కించపరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు  మండిపడుతున్నారు. తాజాగా, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఈ వ్యవహారంలో స్పందించారు. గ్రామ వలంటీర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. అంతేకాకుండా, బోయాలమ్మ అనే మహిళా వలంటీర్ ఓ అనాథను 108 వాహనంలోకి ఎక్కిస్తున్న ఫొటోలను ట్వీట్ చేశారు.

స్పృహ కోల్పోయిన ఓ అనాథను ధర్మసాగరం గ్రామ వలంటీర్ బోయాలమ్మ చేరదీసిందని, చికిత్స కోసం అతడిని 108 వాహనంలో ఎక్కించడాన్ని చూడాలని పేర్కొన్నారు. గ్రామ వలంటీర్లు ఇలాంటి గొప్ప మనసున్న వాళ్లు అని, అలాంటివారిపై చంద్రబాబునాయుడు గారు చేసిన వ్యాఖ్యలు నొచ్చుకునే విధంగా ఉన్నాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Chandrababu
Vidadala Rajini
Telugudesam
YSRCP

More Telugu News