Chava Kiranmai: హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి ఖరారు... చావా కిరణ్మయికి చాన్స్

  • కిరణ్మయి పేరు ప్రకటించిన టీ-టీడీపీ చీఫ్ ఎల్.రమణ
  • కిరణ్మయికి బీ-ఫామ్ అందజేసిన ఎల్.రమణ
  • సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్న కిరణ్మయి
తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా, ఇక్కడి నుంచి పోటీచేసే టీడీపీ అభ్యర్థి ఎవరన్నది తెలిసింది. చావా కిరణ్మయి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగనుంది. ఈ మేరకు తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ ఆమె పేరును ప్రకటించారు. కిరణ్మయికి ఆయన బీ-ఫామ్ అందజేశారు. కిరణ్మయి సోమవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. దాంతో, అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. అక్టోబరు 21న పోలింగ్ జరగనుంది.
Chava Kiranmai
Telugudesam
Telangana

More Telugu News