Hyderabad: మరోసారి భారీ వర్షం... హైదరాబాద్ నగరానికి వర్ష సూచన

  • గురువారం హైదరాబాద్ లో కుంభవృష్టి
  • ఇవాళ కూడా వర్షం పడొచ్చని చెప్పిన సీపీ
  • ఇబ్బందులుంటే 100 నెంబర్ కు కాల్ చేయాలని సూచన
గత వందేళ్లలో సెప్టెంబరు మాసంలో ఎన్నడూ కురవనంత భారీ వర్షం గురువారం నాడు హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. నేడు మరోసారి హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇళ్ల నుంచి బయటికి వెళ్లే వాళ్లు తగిన జాగ్రత్తలో వెళ్లాలని, వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తితే 100 నెంబర్ కు కాల్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారని, ప్రయాణాలు చేసేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Hyderabad
Rains
Police

More Telugu News