YSRCP: వైఎస్ వివేకా హత్య కేసును నీరు గార్చాలని చూస్తున్నారు: ఆలపాటి రాజా

  • వివేకా హత్యపై వైసీపీ ఎన్నో రాజకీయాలు చేసింది
  • ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు
  • ఇందుకు సీఎం జగనే బాధ్యత వహించాలి
వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చాలని చూస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ఆలపాటి రాజా ఆరోపణలు గుప్పించారు. వివేకా హత్యపై వైసీపీ ఎన్నో రాజకీయాలు చేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు.

వివేకా హత్య కేసు విచారణపై నాడు తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, ఇందుకు జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను, శాంతి భద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో విద్యుత్ కొరత లేకుండా చూశామని, జగన్ పాలనలో రాష్ట్రాన్ని  అంధకారంగా మారుస్తున్నారని విమర్శలు చేశారు.
YSRCP
cm
Jagan
Telugudesam
Alapati Raja

More Telugu News