Narendra Modi: అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

  • అమెరికా పర్యటనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని
  • సుదీర్ఘంగా సాగిన అమెరికా పర్యటన  
  • ఢిల్లీ పాలం ఎయిర్ పోర్టులో మోదీకి ఘనస్వాగతం
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా సాగిన అమెరికా పర్యటన ముగించుకుని ఈ సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అమెరికాలో భారతీయ సమాజంతో సమావేశాల్లో పాల్గొన్న ఆయన, అక్కడి ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు. ఆపై ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని భారత వాణిని బలంగా వినిపించారు. తన పర్యటన ముగించుకుని ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఆయనకు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు ఘనస్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ శ్రేణులతో విమానాశ్రయ పరిసరాలు సందడిగా మారాయి.
Narendra Modi
USA
New Delhi
BJP

More Telugu News