Siva Prasad: శివప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించిన సుజనా చౌదరి, మోత్కుపల్లి

  • తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి వెళ్లిన నేతలు
  • స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అని మోత్కుపల్లి కితాబు
  • పోరాట యోధుడిని కోల్పోయామని ఆవేదన
దివంగత ఎంపీ శివప్రసాద్ కుటుంబసభ్యులను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి ఈరోజు వీరు వెళ్లారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కు నివాళి అర్పించారు. అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ, శివప్రసాద్ గొప్ప సినీ నటుడు, రాజకీయ నాయకుడని కొనియాడారు. స్నేహానికి ప్రాణమిచ్చే మనస్తత్వమని చెప్పారు. ప్రత్యేక హోదాపై శివప్రసాద్ పోరాటం చేసినట్టు మరెవరూ చేయలేదని అన్నారు. ఒక పోరాట యోధుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Siva Prasad
Sujana Chowdary
Motkupalli
Telugudesam
BJP

More Telugu News