Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఉగ్ర అలజడి... త్రుటిలో ప్రమాదం తప్పించుకున్న ఆర్మీ జవాన్లు

షార్ట్స్‌లో చూడండి
పుల్వామా దాడి ఘటన తర్వాత మరోసారి జమ్మూకశ్మీర్ లో ఉగ్ర కలకలం రేగింది. ఇద్దరు ఉగ్రవాదులు మూడు చోట్ల దాడులకు పాల్పడగా, భారత సైన్యం దీటుగా స్పందించి వారిలో ఒకరిని మట్టుబెట్టింది. మొదట, ఉగ్రవాదులు ఓ పౌర వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, వాహనంలో ఉన్న వ్యక్తి వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై భద్రతా బలగాలకు సమాచారం అందించాడు.

అనంతరం  శ్రీనగర్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఆ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి ఆర్మీ జవాన్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూ-కిస్త్వార్ జాతీయ రహదారిపై ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక, గాందర్ బల్ ప్రాంతంలో ఆ ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మరోసారి తారసపడడంతో తుపాకులు గర్జించాయి. ఓ ఉగ్రవాదిని జవాన్లు హతమార్చి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Go Back to Shorts
Jammu And Kashmir
Army

More Telugu News