Nalgonda: హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థిపై నేడు ప్రకటన?

  • ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు 
  • రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు
  • నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబు
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇక్కడి నుంచి టీడీపీ కూడా తమ సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించారు. ఆ అభ్యర్థి ఎవరన్నది ఈరోజు తేలనుంది. ఈ విషయమై ఈరోజు ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు హైదరాబాద్ కు చంద్రబాబు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం టీ-టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయలో తుది నిర్ణయం తీసుకుంటారని, అనంతరం, ఈ మేరకు ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, వచ్చే నెల 21న ఉపఎన్నిక జరగనుంది. 24న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపుపై ఇప్పటికే ఎనలేని ధీమాను వ్యక్తం చేశాయి.
Nalgonda
Huzurunagar
Telugudesam
Chandrababu

More Telugu News