Ex Minister: మాజీ మంత్రి సత్యారావు మృతికి సీఎం జగన్ సంతాపం

  • సత్యారావు భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం
  • కుటుంబసభ్యులకు ఓదార్పు 
  • చోడవరం నియోజకవర్గానికి తీరని లోటన్న జగన్
విశాఖపట్టణంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి, వైసీపీ నేత బలివాడ సత్యారావు మృతి చెందిన విషయం తెలిసిందే. విశాఖలో ఆయన భౌతికకాయాన్ని ఏపీ సీఎం జగన్ సందర్శించి, నివాళులర్పించారు. సత్యారావు కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. సత్యారావు మృతి చోడవరం నియోజకవర్గానికి తీరనిలోటు అని అన్నారు. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ నేతలు ఉన్నారు.
Ex Minister
Baliwada
satyarao
cm
Jagan

More Telugu News