NITI Aayog: నీతి ఆయోగ్ మాజీ సీఈవోపై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • ఐఎన్ఎస్ మీడియా కేసులో సింధుశ్రీ ఖుల్లార్ విచారణకు కేంద్రం అనుమతి
  • ఆమెతో పాటు మరో ముగ్గురు మాజీ అధికారుల విచారణకు గ్రీన్ సిగ్నల్
  • ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసు విచారణ ఊపందుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లార్ ను విచారించేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. సింధుశ్రీతో పాటు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి అనూప్ కే పూజారి, అప్పట్లో ఆర్థిక శాఖ డైరెక్టర్ గా పని చేసిన ప్రబోధ్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ రవీంద్ర ప్రసాద్ లను కూడా విచారించేందుకు అనుమతించింది. ఇప్పటికే కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
NITI Aayog
Sindhushree Khullar
INX Media Case
CBI
Union Government

More Telugu News