Chandrababu: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును పరామర్శించిన చంద్రబాబు

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ గజపతి
  • ఇంటికెళ్లి ఆరోగ్యంపై ఆరా తీసిన చంద్రబాబు
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అశోక్ గజపతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు అశోక్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Chandrababu
viziangaram
Telugudesam
ashok gajapati raju

More Telugu News