Chandrababu: చంద్రబాబు ఉంటే బోటును గంటలో తీస్తారా? చంద్రబాబేమన్నా స్విమ్మరా, డైవరా?: అవంతి వ్యాఖ్యలు

  • బోటు వెలికితీతపై అవంతి స్పందన
  • ఒడ్డున కూర్చుని ఎన్నైనా మాట్లాడొచ్చంటూ విసుర్లు
  • వాతావరణం అనుకూలించడంలేదని వెల్లడి
గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తున్నామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. కానీ కొందరు చంద్రబాబు ఉంటే గంటలో తీసేవారు, రెండు గంటల్లో తీసేవారని అంటున్నారని, బోటును కొన్ని గంటల్లోనే వెలికి తీయడానికి చంద్రబాబేమన్నా స్విమ్మరా, డైవరా? అంటూ వ్యాఖ్యానించారు. ఒడ్డున కూర్చున్నవాళ్లు ఎన్నైనా మాట్లాడతారని అన్నారు. బోటును బయటికి తీసేందుకు వాతావరణం ప్రతికూలంగా మారిందని, ఎంత ఖర్చయినా బోటును వెలికితీయాలని సీఎం జగన్ ఆదేశించారని అవంతి వివరించారు.
Chandrababu
Avanthi
Andhra Pradesh
Godavari
Boat

More Telugu News