Telugudesam: తమ్మినేని సీతారాం చేసే అరాచకాలు, అవినీతిని నీడలా వెంటాడతా: కూన రవికుమార్

  • ప్రజల గొంతుకను నా గొంతుకగా వినిపిస్తా
  • వైసీపీ ప్రభుత్వ అవినీతికి బాసటగా నిలవొద్దు
  • అధికారులకు, ఉద్యోగస్తులకు నా విజ్ఞప్తి
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్‌ నెల రోజుల అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంపై నిప్పులు చెరిగారు.

‘నా భవిష్యత్ కార్యాచరణ ఒకటే, ఒకే అజెండా. ఆమదాలవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం చేసే అరాచకాలు, అఘాయిత్యాలు, ఘోరాలు, అవినీతిని నీడలా వెంటాడతా. ప్రజల గొంతుకను నా గొంతుకగా వినిపిస్తాను’ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, ఆగడాలకు, అరాచకాలకు బాసటగా నిలవద్దని అధికారులకు, ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ‘మీ (అధికారులు, ఉద్యోగస్తులు) భుజాల మీద నుంచి తెలుగుదేశం పార్టీని షూట్ చేయాలని అనుకుంటున్నారు. దానికి మీరు సహకరించకండి. నేను చేతులెత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.
Telugudesam
kuna ravikumar
Tammineni
YSRCP

More Telugu News