Nara Lokesh: పిచ్చోడి చేతిలో రాయి అన్నందుకే కేసుపెడితే సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న మిమ్మల్నేం చేయాలి?: జగన్ పై లోకేశ్ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టారని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎంను నడిరోడ్డు మీద కాల్చి చంపాలి అన్న మిమ్మల్నేం చేయాలి వైఎస్ జగన్ గారూ? అంటూ నిలదీశారు. మిమ్మల్ని ఉరితీయాలా? అంటూ ప్రశ్నించారు.

 "ప్రజాసమస్యలు పరిష్కరించే సత్తా మీవద్ద లేక మా నేతల ప్రెస్ మీట్లపై కులమతాల పేరుతో కేసులు పెడతారా? ఇది తుగ్లక్ చర్యే కదా! మీకు, మీ నేతలకు దమ్ముంటే మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అంతేకానీ, చేతగాని దద్దమ్మలా కేసులు పెట్టి పారిపోవద్దు" అంటూ సవాల్ విసిరారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News