Hyderabad cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా అజారుద్దీన్ ఘన విజయం

  • పోటీపడ్డ అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్
  • మొత్తం ఓట్లు 227..పోలైన ఓట్లు 223
  • అజారుద్దీన్ కు లభించిన ఓట్లు 147 
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రెసిడెంట్ గా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ కి పలువురు అభినందనలు తెలిపారు. ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. కాగా, హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం అజారుద్దీన్ సహా ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ పోటీ పడ్డారు. మొత్తం ఓట్లు 227 కాగా, పోలైన ఓట్లు 223. అజారుద్దీన్ కు 147, ప్రకాశ్ జైన్ కు 73, దిలీప్ కుమార్ కు 3 ఓట్లు లభించాయి.
Hyderabad cricket Association
Azaharudding
President

More Telugu News