Rajnath Singh: పొరుగుదేశం ఉగ్రవాదుల కన్ను మన తీరప్రాంతంపై పడింది... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: రాజ్ నాథ్ సింగ్

  • ట్విట్టర్ లో రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు
  • తీరప్రాంతంలో ఉగ్రదాడి అవకాశాలను కొట్టిపారేయలేమన్న రాజ్ నాథ్
  • భద్రత బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ట్వీట్
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశానికి చెందిన తీవ్రవాదులు మన తీరప్రాంతంపై దాడికి పాల్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. కచ్ నుంచి కేరళ వరకు పశ్చిమతీరం విస్తరించి ఉందని, తీరం వెంబడి ఏదో ఒక చోట దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. అయితే, భారత సముద్ర భద్రత వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని, తీరప్రాంత వాసుల రక్షణకు భద్రత బలగాలు భరోసానిస్తున్నాయని తెలిపారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు రక్షణ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
Rajnath Singh
India
Pakistan

More Telugu News