Tadepalli: తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చి దిద్దుతాం: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

  • ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి
  • రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు
  • బాబు హయాంలో ఈ ప్రాంతాల అభివృద్ధి జరగలేదు
తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చి దిద్దుతామని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని రెండు నెలల్లోనే సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ కృషి చేస్తారని, రూ.1500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు తన హయాంలో ఇక్కడి అభివృద్ధికి పాటుపడలేదని విమర్శించారు. అందుకే, మొన్నటి ఎన్నికల్లో లోకేశ్ ను ప్రజలు ఓడించారని అన్నారు.
Tadepalli
Managalagiri
YSRCP
RK

More Telugu News