kuna ravikumar: బెయిలు మంజూరు కావడంతో ఇంటికి చేరిన కూన రవికుమార్‌

  • నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీకాకుళం నేత
  • మండల అధికారులపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు
  • అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్న మాజీ విప్‌
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ప్రభుత్వం హయాంలో విప్‌గా పనిచేసిన కూన రవికుమార్‌ నెల రోజుల అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్నారు. సరుబుజ్జిలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల స్థాయి అధికారులపై ఆయన దురుసుగా ప్రవర్తించడమేకాక పరుషంగా మాట్లాడారు. దీంతో అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తొలుత స్థానిక కోర్టులో బెయిల్‌కు పిటిషన్‌ వేసినా కోర్టు తిరస్కరించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్నారు.
kuna ravikumar
Telugudesam
Srikakulam District
amadalavalasa
bail

More Telugu News