Jagan: అందుకే... టీడీపీ చేసిన మంచి పనులనే మళ్లీ చేసి, మేమే చేశామని చెప్పుకుంటున్నారు: నారా లోకేశ్ దెప్పిపొడుపు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. గల్లీలో మళ్లీ మళ్లీ పెళ్లిలాగ... టీడీపీ రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాలను మళ్లీ రద్దు చేయడం, టీడీపీ భూమి పూజ చేసిన టీసీఎల్ కంపెనీకి మళ్లీ భూమి పూజ చేయడం... టీడీపీ తెచ్చిన కియా మోటార్స్ సంస్థ 15 ఏళ్ల క్రితమే మా తండ్రి మూలంగా వచ్చిందనడం... పోలవరం కట్టింది మా తండ్రే అనడం... ఏమిటో ఇదంతా? అంటూ ఎద్దేవా చేశారు.

 వైసీపీ నేతలు మాత్రం ఏం చేస్తారులెండి అని దెప్పిపొడిచారు. జగన్ గారు ఏదైనా సొంత పని చేస్తే... ఏంటీ తుగ్లక్ పనులు అని ప్రజలు అనుకుంటున్నారని... అందుకే టీడీపీ చేసిన మంచి పనులనే మళ్లీ చేసి, లేదా మనమే చేశామని చెప్పుకుంటే బెటర్ కదా అని వైసీపీ నేతలు అనుకుంటున్నారని ఎద్దేవా చేవారు. ఎవరు ఏం చేయగలరో ప్రజలకు తెలుసు కదా? అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Jagan
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News