Hyper Aadi: తన బంధువుల కుర్రాడి కోసం వేణుమాధవ్ రికమెండ్ చేశారు.. అదే ఆయన చివరి కోరిక అయింది: హైపర్ ఆది

  • వేణుమాధవ్ మృతితో శోకసంద్రంలో టాలీవుడ్
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన హైపర్ ఆది
  • స్కిట్ నచ్చితే ఫోన్ చేసి మెచ్చుకునేవాడని వెల్లడి
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ హఠాన్మరణం తెలుగు వినోదరంగాన్ని విషాదంలో ముంచెత్తింది. వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం ఉన్న చాలామంది తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాప్యులర్ అయిన హైపర్ ఆది కూడా కదిలిపోయాడు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా ముందు నిలిచే వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు.

ఇటీవలే వేణుమాధవ్ తనకు ఫోన్ చేసి బంధువుల కుర్రాడికి జబర్దస్త్ లో చాన్స్ ఇవ్వాలని కోరాడని, ఆయన చెప్పినట్టే ఆ కుర్రాడికి ఓ స్కిట్ లో అవకాశం ఇచ్చామని ఆది వివరించాడు. అదే వేణుమాధవ్ తనను కోరిన చివరి కోరిక అయిందని చెబుతూ హైపర్ ఆది భావోద్వేగాలకు గురయ్యాడు. జబర్దస్త్ కార్యక్రమం ఏదైనా స్కిట్ తనకు నచ్చితే వెంటనే ఫోన్ చేసి మెచ్చుకునేవాడని వేణుమాధవ్ మనస్తత్వం గురించి చెప్పాడు.
Hyper Aadi
Venu Madhav
Tollywood
Jabardast

More Telugu News