Indonesia: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం... 20 మంది మృతి

షార్ట్స్‌లో చూడండి
పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించి ఉన్న ఇండోనేషియా దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. మాలుకు ప్రావిన్స్ లో 6.5 తీవ్రతతో భూకంపం రావడంతో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. చాలాచోట్ల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం ధాటికి 20 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. తీవ్రస్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
Go Back to Shorts
Indonesia
Maluku
Earthquake

More Telugu News