రూ. 750 కోట్లు తగ్గించామంటూ రూ. 7500 కోట్ల నష్టం చేకూర్చారు: చంద్రబాబు
- పోలవరం పనులకు మేఘా గతంలో ఎక్కువ కోట్ చేసింది
- క్విడ్ ప్రోకోలో భాగంగానే ఇప్పుడు తక్కువ కోట్ చేసింది
- ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగింది
మేఘా కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ సురేంద్రబాబు అడ్డుపడితే... ఆర్టీసీ ఎండీ పదవి నుంచి ఆయనను తప్పించారని విమర్శించారు. గోదావరిలో మునిగిన బోటును ఇంతవరకు తీయలేకపోయారని... ఓ ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చినా, దానికి అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చారని చెప్పారు. అన్నింటిపై పోరాడుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.