CI: విజయవాడలో సీఐ ఆత్మహత్య.. కలకలం

షార్ట్స్‌లో చూడండి
విజయవాడలో ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీఐ సూర్యనారాయణ విజయవాడ హనుమాన్ పేట పోలీస్ క్వార్టర్స్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొంత కాలంగా విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో ఆయన బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం ఏలూరు రేంజ్ లో వీఆర్ లో ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సూర్యనారాయణ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆయన 1989 బ్యాచ్ కు చెందిన అధికారి.
Go Back to Shorts
CI
Vijayawada
Suicide

More Telugu News