mig-21: పెను ప్రమాదం నుంచి బయటపడిన బాలాకోట్ దాడుల వ్యూహకర్త

  • మధ్యప్రదేశ్‌లో కూలిన మిగ్-21
  • టేకాఫ్ అయిన కాసేపటికే ఘటన
  • క్షణాల్లో తప్పించుకున్న గ్రూప్ కెప్టెన్ నేగీ
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిన్న టైప్-69 మిగ్-21 ట్రైనర్ విమానం కూలిన ఘటనలో ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వైఎస్ నేగీ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన వాయుదాడుల వ్యూహకర్త ఆయనే. ప్రమాదాన్ని గ్రహించిన నేగీ కొన్ని క్షణాల ముందు విమానం నుంచి దూకి తప్పించుకున్నారు. మహారాజాపూర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన తెలిపింది.
mig-21
Madhya Pradesh
ys negi

More Telugu News