cm: జగన్ గారూ! ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు?: నారా లోకేశ్

  • కాట్రేనికోనలో గ్రామ వాలంటీర్ వేధింపులు
  • మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య 
  • రాక్షసుల్లాంటి వైసీపీ కార్యకర్తలను ప్రజలమీదకు వదుల్తారా?
తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రేనికోనలో గ్రామ వాలంటీర్ వేధింపులతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ పై ప్రశ్నల వర్షం గుప్పించారు.యాభై ఇళ్ళకు ఒక వాలంటీరుని పెడతానని చెప్పి, కీచకులు, రాక్షసుల్లాంటి వైసీపీ కార్యకర్తలను ప్రజలమీదకు వదుల్తారా? అని ప్రశ్నించారు. అన్యాయంగా ఒక వివాహితను వేధించి, వేదనకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. పిల్లలను తల్లి లేనివాళ్ళను చేశారని, ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు? అని లోకేశ్ ప్రశ్నించారు.
cm
Jagan
Telugudesam
Nara Lokesh
YSRCP

More Telugu News