Venumadhav: వేణుమాధవ్ మరణం పట్ల చిరంజీవి సంతాపం

షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు వేణుమాధవ్ మృతి పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 'మాస్టర్' సినిమాలో వేణుమాధవ్ తనతో తొలిసారి నటించారని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. హాస్య నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని కితాబిచ్చారు. వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. వేణు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మరోవైపు సికింద్రాబాద్ యశోదా  ఆసుపత్రి నుంచి వేణుమాధవ్ భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు ఫిలిం ఛాంబర్ వద్ద ఉంచనున్నారు.
Go Back to Shorts
Venumadhav
Tollywood
Chiranjeevi

More Telugu News