Venumadhav: వేణుమాధవ్ మరణం పట్ల చిరంజీవి సంతాపం

  • యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన వేణుమాధవ్
  • హాస్య నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారన్న చిరు
  • వేణు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ వ్యాఖ్య
సినీ నటుడు వేణుమాధవ్ మృతి పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 'మాస్టర్' సినిమాలో వేణుమాధవ్ తనతో తొలిసారి నటించారని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. హాస్య నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని కితాబిచ్చారు. వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. వేణు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మరోవైపు సికింద్రాబాద్ యశోదా  ఆసుపత్రి నుంచి వేణుమాధవ్ భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు ఫిలిం ఛాంబర్ వద్ద ఉంచనున్నారు.
Venumadhav
Tollywood
Chiranjeevi

More Telugu News