Undavalli: హైకోర్టును ఆశ్రయించిన లింగమనేని రమేశ్

  • కరకట్టపై అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ నోటీసులు
  • సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసిన లింగమనేని
  • వివరణ తీసుకోకుండా కూల్చేస్తామనడం కరెక్టు కాదంటూ వాదన 
ఉండవల్లి కరకట్టపై అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై లింగమనేని రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివరణలు, పత్రాలు తీసుకోకుండా కూల్చేస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. కాగా, కృష్ణా నది కరకట్ట వెంబడి ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని వైసీపీ నేత ఆర్కే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Undavalli
Krishna river
Lingamaneni
Ramesh

More Telugu News