Venumadhav: వేణుమాధవ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు

  • హాస్య నటుడిగా, మిమిక్రీ కళాకారుడిగా చెరగని ముద్ర వేశారు
  • మిమిక్రీతో ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నారు
  • వేణుమాధవ్ మరణం టీడీపీకి తీరని లోటు
సినీ నటుడు వేణుమాధవ్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా వేణుమాధవ్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. మహానాడులో మిమిక్రీ చేసి ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నారని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ ను, టీడీపీని ఎంతో అభిమానించేవారని చెప్పారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారని తెలిపారు. వేణుమాధవ్ మరణం టీడీపీకి కూడా తీరని లోటు అని చెప్పారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Venumadhav
Tollywood
Chandrababu
Telugudesam

More Telugu News