Rohith: నాకు అవకాశాలు రాకపోవడానికి అదో కారణమై ఉండొచ్చు: హీరో రోహిత్

షార్ట్స్‌లో చూడండి
ఒక పుష్కర కాలం క్రితం హీరోగా రోహిత్ కి మంచి పేరు ఉండేది. ప్రేమకథా చిత్రాలపై ఆయన తనదైన ముద్రవేయడానికి ప్రయత్నించాడు. అయితే ఒక వైపున సక్సెస్ లు .. మరో వైపున అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలా సినిమాలకి దూరమైన ఆయన, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

"మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం .. తెరపై కనిపించడమంటే ఇష్టం. అందువల్లనే సినిమాల్లోకి వచ్చాను. అయితే నేను సెట్ కి వెళ్లి నాకు సంబంధించిన షూటింగు పూర్తికాగానే వచ్చేస్తాను .. అందరిలో అంత త్వరగా కలవలేను. 'చిత్రపరిశ్రమలో నలుగురితో కలవాలి .. నలుగురితో తిరగాలి .. మాట్లాడాలి అప్పుడే అవకాశాలు వస్తాయి' అని సన్నిహితులు చెబుతుంటారు. కారణం లేకుండా నేను ఎవరినీ కలవలేను .. అవకాశాలు అడగలేను .. నాలోని మైనస్ అదేనని నేను అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Rohith

More Telugu News