Maharashtra: మహారాష్ట్రలో అరుదైన సర్పం... గ్రామస్థుల కంటపడిన రెండు తలల పాము!

  • కాపాడిన జంతుశాస్త్ర నిపుణుడు
  • వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలింపు
  • జన్యు లోపంతో పుడతాయంటున్న నిపుణులు
మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో అరుదైన సర్పరాజాన్ని గుర్తించడంతో దాన్ని భద్రంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. సాధారణంగా శరీరానికి రెండు వైపులా తలలున్న పాములు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కానీ ఒకే వైపున రెండు తలల పాములు అరుదుగా కనిపిస్తాయి. అటువంటి అరుదైన సర్పరాజాన్ని ఠానే జిల్లా కల్యాణ్‌నగర్‌ వాసులు గుర్తించారు. గ్రామస్థులు కొందరు నడిచి వెళ్తుండగా ఈ పాము వారి కంట పడింది. దీంతో స్థానిక జంతుశాస్త్ర నిపుణుడు హరీష్‌జాదవ్‌, సందీప్‌ పండిట్‌లు ఈ పామును కాపాడి ‘వార్‌ రెస్క్యూ ఫౌండేషన్‌’ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. జన్యులోపాల కారణంగా ఇలాంటివి పుడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
Maharashtra
thene district
two heads snake

More Telugu News