Jagan: కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా ఎల్లో మీడియా కథనాలు రాసింది: విజయసాయిరెడ్డి

  • జగన్, కేసీఆర్ చర్చలపై ఎల్లో మీడియా విషం చిమ్మింది
  • కేంద్ర ప్రభుత్వంపై సీఎంల అసంతృప్తి అంటూ కథనాలు రాసింది
  • చంద్రబాబు కోసం ఈ మీడియా బానిసలు ఎంతకైనా దిగజారుతారు
రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ చర్చలు జరిపితే ఎల్లో మీడియా విషం కక్కిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నదీ జలాల వినియోగం, విభజన అంశాలపై మాట్లాడితే విషం చిమ్మిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎంల అసంతృప్తి అంటూ కథనాలు రాసి కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఎంత నీచానికైనా ఈ మీడియా బానిసలు దిగజారుతారని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Jagan
KCR
Chandrababu
Vijayasai Reddy
Telugudesam
YSRCP
TRS

More Telugu News