Jagan: అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పట్ల సీఎం జగన్ స్పందన

  • అమితాబ్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు
  • అభినందించిన సీఎం జగన్
  • చిత్రపరిశ్రమ గర్వించదగ్గ క్షణాలు అంటూ ట్వీట్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికైనందుకు అమితాబ్ బచ్చన్ కు శుభాకాంక్షలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. భారతీయ సినిమా రంగానికి ఆయన అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. సరైన వ్యక్తినే ఈ పురస్కారం వరించిందని, యావత్ చిత్రపరిశ్రమ గర్వించదగ్గ క్షణాలు అంటూ తన ట్వీట్ లో వివరించారు.
Jagan
Amitabh Bachchan
Dadasaheb Phalke
Bollywood

More Telugu News