Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

  • ట్విట్టర్ లో వెల్లడించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్
  • రెండు తరాల ప్రజలను అలరిస్తున్నాడని కితాబు
  • శుభాభినందనలు తెలియజేస్తూ ట్వీట్
భారతదేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్ ను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. రెండు తరాల ప్రజలను  తన నటనతో ఉర్రూతలూగిస్తున్న అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. యావత్ భారతావనికే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా సంతోషపడే విషయమిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ కు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.
Amitabh Bachchan
Dadasaheb Phalke
Bollywood

More Telugu News