Nagababu: గెటప్ శీనుని ఆకాశానికి ఎత్తేసిన నాగబాబు

  • గెటప్ శీను మంచి నటుడు
  • ఏ పాత్రనైనా అవలీలగా చేస్తాడు  
  • చిత్రపరిశ్రమ అతని ప్రతిభను ఉపయోగించుకోవాలన్న నాగబాబు  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. ఆ జాబితాలో గెటప్ శీను .. సుడిగాలి సుధీర్ .. రామ్ ప్రసాద్ పేర్లు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా తాజాగా 'త్రీ మంకీస్' చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ వేదికపై నాగబాబు మాట్లాడుతూ .. "రామ్ ప్రసాద్ మంచి రచయిత .. నటుడు. సుడిగాలి సుధీర్ మంచి టైమింగ్ వున్న నటుడు. ఇక గెటప్ శీను విషయానికొస్తే, ఇంతవరకూ ఆయన గురించి పబ్లిక్ లో ఎక్కడా మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు చెబుతున్నాను .. గెటప్ శీను వంటి ఆర్టిస్టును ఈ జనరేషన్ లో నేను చూడలేదు. ఏ భాషలోనైనా అంతర్జాతీయ స్థాయిలో నటించగలిగే ఏకైక నటుడని చెప్పగలను. తెలుగు చిత్రపరిశ్రమ అతణ్ణి ఉపయోగించుకోకపోతే, ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినట్టు అవుతుంది" అంటూ గెటప్ శీనుని ఆకాశానికి ఎత్తేశారు.
Nagababu
Getup Srinu

More Telugu News