Jagan: రౌడీయిజం జగన్ రక్తంలోనే ఉంది: అయ్యన్నపాత్రుడు

  • పోలీసు వ్యవస్థలో కూడా రౌడీయిజం పెరిగిపోయింది
  • డీజీపీ మాత్రం మౌనంగా ఉంటున్నారు
  • జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది
వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థలో కూడా రౌడీయిజం పెరిగిపోయిందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నా... డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారని చెప్పారు.

విశాఖపట్టణం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని... ఇలాంటి ప్రాంతంలోకి కడప సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. పెన్షన్లు మినహా అన్నింటినీ రద్దు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దొంగతనం అంటగట్టి కోడెలను మానసిక క్షోభ అనుభవించేలా చేశారని మండిపడ్డారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని చెప్పారు.
Jagan
Ayyanna Patrudu
Telugudesam
YSRCP

More Telugu News