TV9: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం

షార్ట్స్‌లో చూడండి
ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. టీవీ9 నూతన యాజమాన్యం చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ తీసుకునేందుకు అడ్డంకిగా ఉన్న కొన్ని నిబంధనలను తొలగించాలంటూ తాజాగా రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.

పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా హాజరవకుండా మినహాయింపు ఇవ్వాలని, విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని తన పిటిషన్ లో రవిప్రకాశ్ అర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రవిప్రకాశ్ విన్నపాలను తోసిపుచ్చింది.
Go Back to Shorts
TV9
Ravi Prakash
High Court

More Telugu News