Harish Shankar: రవితేజలేని లైఫ్ ను ఊహించుకోలేను: దర్శకుడు హరీశ్ శంకర్
- రవితేజ అంటేనే ఎనర్జీ
- జీవితం పట్ల ఆయనకి స్పష్టత వుంది
- ఆయన నాకు లైఫ్ ఇచ్చాడన్న హరీశ్
మాస్ ఆడియన్స్ కి నచ్చే అన్ని అంశాలను మేళవిస్తూ తెరపై కథలను ఆవిష్కరించడంలో హరీశ్ శంకర్ సిద్ధహస్తుడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'గద్దలకొండ గణేశ్, థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రవితేజను గురించి ప్రస్తావించాడు.
"రవితేజ .. నా లైఫ్ .. ఆయన లేని నా లైఫ్ ను ఊహించుకోలేను. ఇటు సినిమాల పట్ల .. అటు జీవితం పట్ల రవితేజ పూర్తి క్లారిటీతో ఉంటాడు. ప్రతి విషయాన్ని గురించి ఆయన చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఎవరేమన్నా పాజిటివ్ గా తీసుకుంటాడు. ఒక విషయంపై తనకి వచ్చిన క్లారిటీ, అవతలి వ్యక్తికి రానప్పుడు ఆయనలో చిన్నపాటి అసహనం కనిపిస్తుంది. తెరపైనే కాదు .. సెట్లోనూ అంతే ఎనర్జీతో ఆయన కనిపిస్తుంటాడు. ఆ స్పీడ్ నాకే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.