Ameerpet: హైదరాబాదులో జ్యోతిష్యుడిని కొల్లగొట్టిన నకిలీ సీబీఐ అధికారులు!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులో నకిలీ సీబీఐ అధికారులు హల్ చల్ చేశారు. జగదీశ్ అనే ఓ జ్యోతిష్యుడిని నిండా ముంచేశారు. వివరాల్లోకి వెళ్తే, సీబీఐ అధికారులమని చెప్పి కొందరు దుండగులు అతని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అక్కడ లభించిన 25 తులాల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. దీంతో పాటు 11 ల్యాప్ టాప్ లు, 12 సెల్ ఫోన్లను తీసుకుని ఉడాయించారు.

అమీర్ పేటలోని అన్నపూర్ణ బ్లాక్ 5వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Ameerpet
Theft
Astrologer

More Telugu News