Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చిరంజీవితో జత కట్టనున్న కాజల్ 
  • 'బంగార్రాజు' పాటల కంపోజిషన్ 
  • యూరప్ లో 'వరల్డ్ ఫేమస్ లవర్'
*  మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనుంది. 'సైరా' తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
*  నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రధారులుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రం కోసం అనూప్ రూబెన్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతోంది.  
*  విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూలును త్వరలో యూరప్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Kajal Agarwal
Chiranjivi
Nagarjuna
Vijay Devarakonda

More Telugu News